
సినీ పరిశ్రమలో విషాదాలు కొనసాగుతున్నాయి.. లెజెండరీ సింగర్ బాల సుబ్రహ్మణ్యం మృతి మరవకముందే ప్రముఖ నిర్మాత కృష్ణకాంత్ మృతి సిని పర్శ్రమను షాక్ అయ్యేలా చేస్తుంది. నిర్మాత కృష్ణకాంత్ గుండెపోటుతో మృతిచెందారు. లక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థలో మేనేజర్ గా పంచేసిన ఆయన తిరిడి సినిమాతో నిర్మాతగా మారారు.
యూత్ ఆడియెన్స్ ను అలరించిన మన్మథుడు సినిమా ఆయన నిర్మించినదే. పుదుకోటకొట్టైలిరిందు శరవణన్, చొల్లి ఆడిప్పేన్, మచ్చి సినిమాలు కూడా కృష్ణకాంత్ నిర్మించారు. గురువారం హార్ట్ ఎటాక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కృష్ణకాంత్ మృతి పట్ల సంతాపాన్ని తెలియచేస్తున్నారు.