
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. సెట్స్ మీద ఉన్న వకీల్ సాబ్ తో పాటుగా మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. క్రిష్ డైరక్షన్ లో సినిమా పవన్ కెరియర్ లోనే డిఫరెంట్ మూవీగా రాబోతుద్నని తెలుస్తుంది. ఇక హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
క్రిష్ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వకీల్ సాబ్ కు మరో 20 రోజులు పవన్ షూటింగ్ చేయాల్సి ఉందని తెలుస్తుంది. ఇక హరీష్ శంకర్ సినిమా మాత్రం 2021 లోనే మొదలవుతుందని తెలుస్తుంది. ఆల్రెడీ గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ అందించిన ఈ క్రేజీ కాంబోలో సినిమా అనగానే ఆడియెన్స్ లో ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది.
పవర్ స్టార్ కెరియర్ లో గబ్బర్ సింగ్ హిట్ చాలా ప్రత్యేకం. పదేళ్ళుగా సరైన హిట్ లేని పవర్ స్టార్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు హరీష్ శంకర్. అందుకే హరీష్ శంకర్ తో సినిమా అనగానే కథ కూడా పూర్తిగా వినకుండా సినిమా కన్ఫాం చేశాడట పవన్ కళ్యాణ్. జస్ట్ లైన్ విని డైరక్టర్ హరీష్ మీద నమ్మకం పెట్టేశాడు పవన్ కళ్యాణ్. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి. సినిమా ప్రీ లుక్ పోస్టర్ మాత్రం ఫ్యాన్స్ ను అలరించింది.