ప్రభాస్ ఖాతాలో మరో రికార్డ్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు. బాహుబలితో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ కు నేషనల్ వైడ్ క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాస్ ప్రతి అప్డేట్ ను తెలుసుకునేందుకు ఆయన్ను తెగ ఫాలో అవుతున్నారు. ప్రభాస్ ఫేస్ బుక్ ఫాలోవర్స్ 20 మిలియన్ మార్క్ క్రాస్ అయ్యింది. సౌత్ స్టార్స్ లో ఈ రికార్డ్ అందుకున్న ఏకైక హీరో ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్ ను ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఇష్టపడుతున్నారో ఈ రికార్డ్ చూస్తే తెలుస్తుంది.  

బాహుబలి తర్వాత సాహోతో బాలీవుడ్ ఆడియెన్స్ ను అలరించాడు ప్రభాస్. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత ఆదిపురుష్ సినిమా కూడా లైన్ లో పెట్టాడు. ప్రభాస్ తో సినిమా కోసం బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రభాస్ ఫేస్ బుక్ లో 20 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. ఇన్ స్టాగ్రాం ఎకౌంట్ లో 5.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.    

ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరక్షన్ లో భారీ మూవీ ఫిక్స్ చేసుకున్నాడు. సైన్స్ ఫిక్షన్ కథతో వస్తున్న ఈ సినిమాను కూడా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.