
యువ హీరో నితిన్ భీష్మ హిట్ తో మళ్ళీ ఫాంలోకి వచ్చాడని చెప్పొచ్చు. ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్న నితిన్ ఈ సినిమా తర్వాత అందాదున్ తెలుగు రీమేక్ చేస్తున్నాడు. మేర్లపాక గాంధి ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నరు. ఇక ఇవి రెండు కాకుండా చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో నితిన్ హీరోగా ఓ సినిమా వస్తుంది. షూటింగ్ ఎప్పుడో మొదలైన ఈ సినిమాకు సంబందించిన క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.
నితిన్, చంద్రశేఖర్ యేలేటి కాంబోలో వస్తున్న సినిమాకు చెక్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ రిలీజ్ చేశారు. సినిమా ప్రీ లుక్ పోస్టర్ లో టైటిల్ తో పాటుగా సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుందని హింట్ ఇచ్చాడు డైరక్టర్. ప్రీ లుక్ లో సంకెళ్లతో నితిన్ కనిపిస్తున్నాడు. లవర్ బోయ్ ఇమేజ్ నుండి యాక్షన్ హీరోగా మారేందుకు నితిన్ చేస్తున్న మరో ప్రయత్నం ఈ సినిమా అని చెప్పొచ్చు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రీ లుక్ తో అదుర్స్ అనిపించిన ఈ సినిమా నితిన్ కెరియర్ ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.