రామ్ రెడ్.. థియేటర్ లో రిలీజ్ కు రెడీ..!

కరోనా కారణంగా ఏడు నెలల నుండి సినిమా హాళ్లు మూసి ఉన్న విషయం తెలిసిందే. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గకపోయినా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇస్తూ వస్తుంది. లేటెస్ట్ గా అన్ లాక్ 5.0 లో భాగంగా సినిమా హాళ్ళకు పర్మిషన్ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. అక్టోబర్ 15 నుండి థియేటర్ లు ఓపెన్ చేయ్యొచ్చని ప్రకటించారు. 50 శాతం ఆక్యుపెన్సీతోనే, సోషల్ డిస్టన్స్ మెయింటైన్ చేసేలా చూసుకోవాలని చెప్పారు.

ఇక థియేటర్లు ఓపెన్ అయితే మొదట రిలీజ్ అయ్యే క్రేజీ మూవీపై చర్చలు మొదలయ్యాయి. అక్టోబర్ 15న థియేటర్లు ఓపెన్ అయితే దీపావళికి రామ్ రెడ్ సినిమా రిలీజ్ సిద్ధం చేస్తున్నారు. నవంబర్ 14న దీపావళి పండుగా ఉంది. దానికి ఒకరోజు ముందు ఫ్రైడే రెడ్ సినిమా రిలీజ్ చేయొచ్చని టాక్. అదే జరిగితే ఆఫ్టర్ లాక్ డౌన్ వచ్చే మొదటి స్టార్ సినిమా రెడ్ అవుతుంది. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తడం కు రీమేక్ గా తెరకెక్కింది. మాళవిక శర్మ, అమృత అయ్యర్, నభా నటేష్ లు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.