కత్తిలాంటి కథలతో బాలయ్య సై..!

సీనియర్ స్టార్ హీరోల్లో వరుస సినిమాలతో తన సత్తా చాటుతున్నాడు నందమూరి బాలకృష్ణ. 100వ సినిమా శాతకర్ణి నుండి బాలయ్య బాబు సినిమాల వేగాన్ని పెంచాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్న బాలకృష్ణ ఆ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమాల కథల వేటలో పడ్డాడు. బాలకృష్ణ దగ్గరకు ఐదు కథలు రాగా అందులో 3 సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అందులో ఒకటి పరుచూరి బ్రదర్స్ రాయగా.. మరోటి సాయి మాధవ్ బుర్ర, వేరొకటి కోనా వెంకట్ రాశారని తెలుస్తుంది.    

ఈ మూడు స్టోరీలు నచ్చడంతో బాలకృష్ణ వారికి ఓకే చెప్పారట. త్వరలోనే వీటికి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. బోయపాటితో తీసే హ్యాట్రిక్ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ దసరాకి వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తుంది. అంజలి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.