అనుపమ ఛాన్స్ మిస్సైందా..?

మల్లూవుడ్ భామ అనుపమ పరమేశ్వరన్ కు బ్యాడ్ లక్ కొనసాగుతూనే ఉంది. మళయాళ ప్రేమం తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనుపమ ఆ సినిమా తెలుగు రీమేక్ లో కూడా నటించింది. త్రివిక్రం అఆలో అదరగొట్టిన అనుపమ శతమానం భవతి సినిమాలో హిట్ అందుకుంది. గ్లామర్ షో విషయంలో ఆమడదూరంలో ఉండే అమ్మడు తనకు వచ్చిన ఛాన్సులనే చేస్తూ వస్తుంది. అయితే అనుపమ కెరియర్ లో తన దాకా వచ్చి మిస్సైన సినిమాలు ఉన్నాయి.   

రాం చరణ్ రంగస్థలం సినిమాలో రామ లక్ష్మి పాత్రకు ముందు అనుపమని అనుకున్నారు కాని ఎందుకో సెట్ అవదని ఆమెని పక్కన పెట్టి సమంతని సెలెక్ట్ చేశారు. ఇక లేటెస్ట్ గా కార్తికేయ 2 సినిమాలో కూడా అనుపమ నటిస్తుందని అన్నారు. తీరా చూస్తే ఆమె ప్లేస్ లో నాని గ్యాప్ లీడర్ హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ వచ్చి చేరింది. చందు మొండేటి, నిఖిల్ కాంబోలో సూపర్ హిట్ సినిమాకు సీక్వల్ గా వస్తున్న కార్తికేయ 2 నుండి ఆమధ్య వచ్చిన గస్ట్ గ్లింప్స్ సర్ ప్రైజ్ చేసింది. కార్తికేయ 2 కచ్చితంగా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. అలాంటి ఛాన్స్ మిస్సైన అనుపమ నిజంగానే అన్ లక్కీ అని చెప్పొచ్చు.