గండిపేటలో అల్లు స్టూడియో..!

నవ్వుల రాజు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా అల్లు అరవింద్ భారీ ప్రకటన చేశారు. అల్లు రామలింగయ్య పేరు మీద స్టూడియోని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అత్యాధిక ప్రమాణాలతో ఈ ఫిల్మ్ స్టూడియో ఉండబోతుందని చెబుతున్నారు. గండిపేటలో 10 ఎకరాల్లో ఈ స్టూడియో నిర్మిస్తున్నట్టు ప్రకటించారు అల్లు ఫ్యామిలీ.   

వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అల్లు స్టూడియోకి గురించిన విషయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, అల్లు అర్జున్, బాబీ, శిరీష్ లు పాల్గొన్నారు. ఇప్పటికే తెలుగు చలన చిత్ర పరిశ్రమ కోసం అన్నపూర్ణ, రామానాయుడు, సారధి, రామకృష్ణ, పద్మాలయా, రామకృష్ణ స్టూడియోస్ ఉన్నాయి. వీటితో పాటుగా అల్లు స్టూడియో కూడా సినిమా షూటింగ్ కు ఉపయోగపడేలా సిద్ధం చేయనున్నారు. అల్లు స్టూడియోస్ ఎనౌన్స్ మెంట్ పై మెగా, అల్లు ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.