ట్విట్టర్ లోకి అనుష్క..!

స్వీటీ అనుష్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఎన్నాళ్ళ నుండో ఎదురుచూస్తున్న అనుష్క ట్విట్టర్ ఎంట్రీకి తొలి అడుగు పడ్డది. అనుష్క ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసింది. బుధవారం అనుష్క ట్విట్టర్ లోకి ప్రవేశించింది. హాయ్ ఆల్ మీరంతా బాగున్నారని అనుకుంటున్నా ఇదే నా అఫీషియల్ ట్విట్టర్ ఖాతా నా సినిమాల అప్డేట్స్ కోసం మీరు దీన్ని ఫాలో అవ్వొచ్చని ఎనౌన్స్ చేశారు అనుష్క.

ఇప్పటివరకు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాంలో మాత్రమే ఖాతాలు తెరచిన అనుష్క ఫైనల్ గా ట్విట్టర్ లోకి వచ్చింది. ఇలా వచ్చిందో లేదో అప్పుడే ఆమెకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ప్రస్తుతం అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న నిశ్శబ్ధం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అనుష్క ఆన్ లైన్ ఇంటర్వ్యూస్ తో హడావిడి చేస్తుంది. హేమంత్ మధుకర్ డైరక్షన్ లో తెరకెక్కిన నిశ్శబ్ధం సినిమాలో అనుష్క డెఫ్ అండ్ డమ్ పాత్రలో నటించింది.