సౌత్ లో నంబర్ 1 హీరో విజయ్ దేవరకొండ..!

ఐదారు సినిమాలతోనే యూత్ లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఇప్పుడు సౌత్ స్టార్స్ అందరిని వెనక్కి నెట్టి సూపర్ రికార్డ్ అందుకున్నాడు. విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రాం లో 9 మిమియన్ ఫాలోవర్స్ వచ్చారు. సౌత్ లో ఈ రేంజ్ ఫాలోవర్స్ ఉన్న స్టార్ గా విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.    

విజయ్ దేవరకొండ క్రేజ్ కు ఇదో బెస్ట్ ఎక్సాంపుల్ అని చెప్పొచ్చు. విజయ్ తర్వాత సౌత్ స్టార్స్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 8.7 మిలియన్ ఫాలోవర్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. సూపర్ స్టార్ మహెష్ కూదా ఇన్ స్టాగ్రాం లో 5.7 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. మొత్తానికి స్టర్స్ కు సమానంగా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రాంలో వారిని క్రాస్ చేసి సరికొత్త సెన్సేషన్ గా మరాడు.