పుష్పలో నేను లేను..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ నవంబర్ లో మొదలుపెట్టబోతున్నారు చిత్రయూనిట్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ హీరో మాధవన్ విలన్ గా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. చిత్రయూనిట్ ఈ వార్తలపై స్పందించలేదు కాని మాధవన్ రెస్పాండ్ అయ్యాడు.

పుష్ప సినిమాలో తను నటిస్తున్నటు వచ్చిన వార్తలపై రెస్పాండ్ అయిన మాధవన్ అందులో ఎలాంటి వాస్తవం లేదని ట్వీట్ చేశారు. పుష్ప సినిమాలో విజయ్ సేతుపతిని విలన్ గా నటింప చేయాలని అనుకున్నారు. మరి డేట్స్ అడ్జెస్ట్ కాలేదో అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వనన్నారో కాని విజయ్ సేతుపతి ఆ ప్రాజెక్ట్ నుండి ఎగ్జిట్ అయ్యాడు. ఇప్పుడు అతని ప్లేస్ లో మాధవన్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే మాడీ తన ట్విట్టర్ లో ఈ రూమర్స్ క్లియర్ చేశాడు. ప్రస్తుతం మాధవన్ నటించిన నిశ్శబ్ధం సినిమా అక్టోబర్ 2న అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది.