ఇదో కొత్త అనుభూతి..!

మారుతున్న కాలాన్ని బట్టి టెక్నాలజీ.. ఆ టెక్నాలజీ బట్టి మనుషులు మారుతున్నారు. ఒకప్పుడు సినిమా అంటే వెండితెర మీదే చూడాలి అనుకునే వారు ఇప్పుడు మొబైల్ ఫోన్ లో కూడా చూసి ఆనందిస్తున్నారు.  ఓటిటిల వల్ల సినిమా పరిశ్రమకు లాభమా, నష్టమా అన్నది పక్కన పెడితే ప్రేక్షకులు మాత్రం ఎంటర్టైన్ అవుతున్నారు. అయితే సినిమాలు ఓటిటి రిలీజ్ పై అనుష్క తన స్పందన తెలియచేశారు. స్వీటీ అనుష్క నటించిన నిశ్శబ్ధం సినిమా అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది.                       

అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఆన్ లైన్ లోనే ప్రమోట్ చేస్తున్నారు అనుష్క. జూమ్ ద్వారా ఇంటర్వ్యూస్ ఇచ్చిన అనుష్క తన సినిమా ఓటిటి ద్వారా రిలీజ్ అవడం కొత్త అనుభూతి అని అన్నారు. అయితే థియేటర్ లో వచ్చే సౌండ్స్ ఎఫెక్ట్స్ ఇక్కడ ఉండవు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఓటిటి రిలీజ్ తప్పనిసరి అంటున్నారు అనుష్క. హేమంత్ మధుకర్ చెప్పిన కథ వినగానే నచ్చేసింది. ఈ సినిమాలో చెవిటి, మూగ పాత్రలో తాను నటించానని.. అందుకోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నానని అన్నారు అనుష్క.