సోనూ సూద్ కు అరుదైన గౌరవం

కరోనా లాక్ డౌన్ టైంలో ఎవరికి ఏ సాయం కావాలన్నా సరే ముందున్న ఒకే ఒక్కడు సోనూ సూద్. ముఖ్యంగా వలస కార్మీకులకు వారి గమ్య స్థానాలను చేరుకునేందుకు బస్సులు, ట్రైన్, విమానం కూడా ఏర్పాటు చేసిన రియల్ హీరో సోనూ సూద్. తను చేసిన ఈ కార్యక్రమాల గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రియల్ హీరో సొనూ సూద్ కు ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. 

ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం యూ.ఎన్.డీ.పీ స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డ్ ను సోనూ సూద్ కి ప్రకటించారు. ఇప్పటివరకు నటనతో మెప్పించిన సోనూ సూద్ తన గొప్ప మనసు చాటుకుంటున్నాడు. అందుకే అతనికి అంతర్జాతీయ స్థాయి నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు. బాలీవుడ్ లో చాలా తక్కువ మందికి దక్కిన ఈ అవార్డ్ ను సోనూ సూద్ అందుకోవడం స్పెషల్ గా చెప్పుకోవచ్చు.