మాస్క్ పెట్టుకుని సినిమా చూస్తాం.. థియేటర్లు ఓపెన్ చేయండి..!

కరోనా టైంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూసినవన్ని దాదాపు అన్ లాక్ అయినట్టే అని చెప్పొచు. ఈమధ్యనే బార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎటొచ్చి సినిమా హాళ్లకే పర్మిషన్ ఇవ్వలేదు. అయితే బార్లు, జిమ్, రెస్టారంట్, మాల్స్, టెంపుల్స్, బస్, ట్రైన్స్ ఇవన్ని తెరచినప్పుడు థియేటర్స్ కూడా తెరవండి అంటున్నాడు డైరక్టర్ నాగ్ అశ్విన్. థియేటర్లు ఓపెన్ చేస్తే మాస్క్ పెట్టుకుని సినిమాలు చూస్తాం అందరి భధ్రత గురించి ఆలోచిస్తాను అంటున్నాడు మహానటి డైరక్టర్.           

అంతేకాదు థియేటర్ లో ఫాస్ట్ ఫార్వర్డ్, రివైండ్, పాస్ లు చేయడం కుదరదు కదా అంటూ నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్ హాట్ న్యూస్ గా మారింది. మరి నాగ్ అశ్విన్ ప్రభుత్వాలకు చేసిన రిక్వెస్ట్ ను పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి. మహానటి తర్వాత ప్రభాస్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.