F3 సందడి అప్పటినుండే..!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన సూపర్ హిట్ మూవీ ఎఫ్-2. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో ఒకప్పటి వెంకటేష్ ను ప్రేక్షకులకు గుర్తుచేశాడు అనీల్ రావిపుడి. రైటింగ్ సైడ్ అతనికి ఉన్న స్ట్రెంత్ అంతా వాడుతూ అదరగొట్టేశాడు.

ఇక ఎఫ్-2 సక్సెస్ అవడంతో అప్పుడే ఎఫ్-3 ని ఎనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. హీరోలిద్దరు కూడా ఓకే చెప్పడంతో ప్రాజెక్ట్ కన్ఫాం చేశారు. కరోనా లాక్ డౌన్ వల్ల ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడ్డది. లేటెస్ట్ గా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. 2021 జనవరి నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. ఎఫ్-2 ని మించే కామెడీతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటుగా మరో హీరో కూడా నటిస్తాడని టాక్. మరి అది ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.