రియల్ హీరోకి గ్రాండ్ వెల్కం..!

కరోనా లాక్ డౌన్ టైం లో వలస కార్మికుల కోసం కోట్లు ఖర్చు పెట్టి మరి రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు సోనూ సూద్. అంతేకాదు ఆపద ఎక్కడ అన్నా సరే నేనున్నా అంటూ ముందుకొచ్చాడు. సినిమాలో విలన్ గా నటించినా బయట రియల్ హీరోగా ప్రూవ్ చేసుకున్న సోనూ సూద్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షూటింగ్ లో పాల్గొనేందుకు వచ్చిన సోనూ సూద్ కు గ్రాండ్ వెల్కం పలికారు చిత్రయూనిట్.

ఆల్రెడీ ఎయిర్ పోర్ట్ లోనే సోనూ సూద్ ను చూసి అక్కడ జనాలు ఆయన్ని చూసి ఎక్సయిట్ అయ్యారు. ఇక సెట్ లో సోనూ సూద్ రాగానే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తో చిరు సత్కారం చేయించారు. తను చేస్తున్న మంచి పనులు అతనికి మంచి ఫాలోయింగ్ తెచ్చిపెడుతుంది. సినిమాల్లో నెగటివ్ రోల్స్ చేస్తూ బయట రియల్ హీరో అనిపించుకుంటున్న సోనూ సూద్ కు ఈమధ్య హీరోగా కూడా అవకాశాలు వచ్చినట్టు తెలుస్తుంది.