
యువ హీరో రాజ్ తరుణ్ హీరోగా విజయ్ కుమార్ కొండ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఒరేయ్ బుజ్జిగా. సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో కె.కె రాధామోహన్ ఈ సినిమా నిర్మించారు. రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా అక్టోబర్ 2న ఆహాలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ ను లేటెస్ట్ గా నాగ చైతన్య రిలీజ్ చేశారు. సినిమా ట్రైలర్ చూస్తే కామెడీ ఎంటర్టైనర్ లానే అనిపిస్తుంది.
కన్ఫ్యూజ్ కామెడీతో సినిమా తీయడం ఒక ఆర్ట్. ఆ కామెడీ క్లిక్ అయితే సినిమా హిట్ అయినట్టే. ఆహాలో అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసిందని చెప్పొచ్చు. కొన్నాళ్ళుగా కెరియర్ లో సక్సెస్ లు లేక వెనుకపడ్డ రాజ్ తరుణ్ కు ఈ సినిమా సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి. రిలీజ్ అయ్యేది ఓటిటి లోనే అయినా ప్రేక్షకులు మెచ్చితే మాత్రం మౌత్ టాక్ తో హిట్ చేస్తారు.