బండ్లకు మరో ఛాన్స్ ఇచ్చిన పవన్

అజ్ఞాతవాసి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. వకీల్ సాబ్ తర్వాత మూడు సినిమాలు లైన్ లో ఉండగా మరో సినిమా కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని బండ్ల గణేష్ రివీల్ చేయడం విశేషం. మై బాస్ మరో సినిమాకు ఒప్పుకున్నారు.. థ్యాంక్స్ మై గాడ్ పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ హీరోగా ఈ సినిమా వస్తుంది.

అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. పవన్ తో సినిమా అంటే ఎప్పుడు రెడీగా ఉండే బండ్ల గణేష్ ఈసారి కూడా ప్రయత్నాలు ఫలించాయని తెలుస్తుంది. తన కెరియర్ లో 30వ సినిమా అవుతుంది. వకీల్ సాబ్ తర్వాత క్రిష్ డైరక్షన్ లో 27, హరీష్ శంకర్ తో 28, సురేందర్ రెడ్డితో 29వ సినిమా చేస్తున్న పవన్.. 30వ సినిమాను బండ్ల గణేష్ కు చేస్తానని చెప్పారట. మరి ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో త్వరలో తెలుస్తుంది.