
బిగ్ బాస్ సీజన్ 4లో మూడవ వారం ఎలిమినేట్ అయ్యారు టివి9 దేవి నాగవల్లి. హౌజ్ లో స్టాంగ్ కంటెస్టంట్ అనుకున్న ఆమె సడెన్ గా 3వ వారమే ఎలిమినేట్ అవడంపై ఆడియెన్స్ కూడా షాక్ అవుతున్నారు. లాస్ట్ వీక్ ఏడుగురు హౌజ్ మేట్స్ నామినేషన్స్ ఉండగా దేవి స్ట్రంగ్ కంటెస్టంట్ కాబట్టి ఆమె తప్పకుండా సేవ్ అవుతుందని మిగతా వారి మీద దృష్టి పెట్టారు. తీరా చూస్తే ఆమెకు తక్కువ ఓట్లు పడి దేవి నాగవల్లి హౌజ్ నుండి ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది.
హౌజ్ లో సేఫ్ గేమ్ ఆడుతున్న చాలామంది కన్నా దేవి నాగవల్లి బెటర్ అని అంటున్నారు. ఆమెని ఎలిమినేట్ చేయడం బిగ్ బాస్ డెశిషన్ ను తప్పుబడుతున్నారు ఆడియెన్స్. మూడు వారాల వరకు సేఫ్ గేమ్ ఆడిన కొందరు హౌజ్ మేట్స్ ఇక మీదట అది పనికిరాదని తేలింది. హౌజ్ లో స్ట్రాంగ్ అనుకున్న దేవి హౌజ్ నుండి బయటకు వచ్చింది అంటే ఆడియెన్స్ స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉన్న వారికే ఓటు వేస్తున్నట్టు హౌజ్ మేట్స్ కూడా జాగ్రత్త పడుతున్నారు.