
టాలీవుడ్ లో అసలేమాత్రం డిస్కషన్స్ లో లేని ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. క్రేజీ డైరక్టర్ సుకుమార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నట్టు ప్రకటన వచ్చింది. ఈ సినిమాను కెదర్ సెలగంశెట్టి నిర్మిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం సుకుమార్ పుష్ప సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమా చేస్తున్నాడు. కమిటైన వారి సినిమాలు పూర్తి చేసుకుని కలిసి ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది.
విజయ్ దేవరకొండతో సుకుమార్ ఈ కాంబినేషన్ పై ఆడియెన్స్ లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా గురించి అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తూ తప్పకుండా గుర్తుండిపోయే సినిమా ఇస్తామని అన్నాడు విజయ్ దేవరకొండ. మరి ఈ ఇద్దరు కలిసి చేసే సినిమా కథ ఏంటి.. ఎలా ఉండబోతుందో అని ఆడియెన్స్ సూపర్ ఎక్సయిటెడ్ గా ఉన్నారు.
Sukumar - Vijay Deverakonda
The actor in me is super excited
The audience in me is celebrating!
We guarantee you memorable Cinema.. I can't wait to be on set with Sukku sirrr 😘🤗
Happy birthday Kedar, you've been a good friend and you work extremely hard :) pic.twitter.com/9CHIIvcpBw