ఆ డైరక్టర్ తో చరణ్ పాన్ ఇండియా మూవీ..?

ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న రాం చరణ్ ఆ సినిమాతో పాటుగా చిరు హీరోగా చేస్తున్న ఆచార్య సినిమాలో కూడా స్పెషల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడని ఫ్యాన్స్ అంతా ఎక్సయిటింగ్ గా ఉన్నారు. సందీప్ వంగతో చరణ్ సినిమా చేస్తారని వార్తలు రాగా ఆ కాంబో సినిమాపై క్లారిటీ రాలేదు. 

ఇక లేటెస్ట్ గా వంశీ పైడిపల్లితో రాం చరణ్ సినిమా ఉంటునని అంటున్నారు. చరణ్ తో వంశీ పైడిపల్లి ఎవడు సినిమా చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి చేయలేదు. ఈమధ్య మహేష్ తో సినిమా ప్రయత్నాలు చేసిన వంశీ పైడిపల్లి అది సక్సెస్ అవకపోవడంతో చరణ్ తో సినిమా చేయాలని చూస్తున్నాడట. చరణ్ కు ఇప్పటికే లైన్ చెప్పడం అతను ఇంట్రెస్ట్ చూపించడం జరిగిందట. త్వరలోనే బౌండెడ్ స్క్రిప్ట్ చెప్పి చరణ్ ను మెప్పిస్తే సినిమా ఫిక్స్ అంటున్నారు. చరణ్ ఓకే అంటే వంశీ పైడిపల్లి ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తీయాలని అనుకుంటున్నాడట. మరి చరణ్, వంశీ పడిపల్లి సినిమా ఉంటుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.