కొందరి స్థాయి విశ్వవ్యాప్తం

తన గాత్ర మాధుర్యంతో ఆబాల గోపాలాన్ని అలరించి.. కోట్ల మంది అభిమానుల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. దాదాపు ఐదు దశాబ్ధాలుగా పాటకి చిరునామాగా ఉన్నారు ఆయన. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన బాలు భౌతికంగా లేరన్న వార్తని జీర్ణించుకోలేము. అయితే బాలు మరణంపై తెలుగు, తమిళ మీడియా రోజు మొత్తం కథనాలు వేస్తే.. నేషనల్ మీడియా మాత్రం పొడి పొడిగానే కవర్ చేసింది. వారు మొత్తం ఎన్.సి.బి విచారణకు హాజరైన హీరోయిన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు.    

బాలు గురించి బిబిసి వరల్డ్ లో స్పెషల్ కవర్ రేజ్ వచ్చింది. ఇది చూసిన హరీష్ శంకర్ కొందరి స్థాయి విశ్వవ్యాప్తం.. ఇరుకు సందుల్లో కాదు అంటూ నేషనల్ మీడియాని చూస్తే జాలేస్తుంది అంటూ సెటైర్ వేశారు. ఆయన తన ట్విట్టర్ లో ఈ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు బిబిసి వరల్డ్ బాలు గురించి కవర్ చేసిన వీడియోని కూడా ఆయన షేర్ చేశారు.