దిశ ఎన్ కౌంటర్ ట్రైలర్ రిలీజ్..!

రియల్ ఇన్సిడెంట్స్ ను తీసుకుని సినిమా తీయడంలో ఆర్జీవిది అందవేసిన చెయ్యి. అందులో క్రైం థ్రిల్లర్ కథలను అయితే పర్ఫెక్ట్ గా డీల్ చేస్తాడు. ప్రస్తుతం దిశ ఎన్ కౌంటర్ కు సంబందించి ట్రైలర్ తోనే ఆడియెన్స్ ను షాక్ అయ్యేలా చేశాడు ఆర్జీవి. ఆయన పర్యవేక్షణలో అనంద్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను నట్టి క్రాంతి, నట్టి కరుణ నిర్మిస్తున్నారు. హైదరబాద్ లో జరిగిన దిశ హత్యోదంతం అందరిని కదిలించి వేసింది. అదే కథాంశంతో ఆర్జీవి సమక్షంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. ట్రైలర్ లోనే దాదాపు సినిమా మొత్తం చూపించాడు ఆర్జీవి. నవంబర్ 26న ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఎనౌన్స్ చేశారు.