సంబంధిత వార్తలు

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ చేతుల మీదగా అంతిమ సంస్కారం పూర్తి చేశారు. తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చెన్నై లోని తామరైపాకం ఫామ్ హౌజ్ లో బాలు అంత్యక్రియలు జరిగాయి.
40 రోజులుగా కరోనాతో పోరాడిన బాలసుబ్రహ్మణ్యం నెగటివ్ వచ్చినా సరే ప్రాణాలు నిలబడలేదు. శుక్రవారం మధ్యాహ్నం 1:04 గంటలకు తుది శ్వాస విడిచారు. బాలు మరణ వార్త సినీ, రాజకీయ ప్రముఖులని దిగ్బ్రాంతికి గురి చేసింది. బాలసుబ్రహ్మణ్యం కడసారి చూసేందుకు తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు భారతీరాజా, దేవి శ్రీ ప్రసాద్, మనో తదితరులు అటెండ్ అయ్యారు.