గాన గంధర్వుడు బాలసుబ్రహణ్యం ఇక లేరు

గాన గంధర్వుడు సినీ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. కరోనా రావడంతో సెప్టెంబర్ 5న హాస్పిటల్ లో చేరిన బాల సుబ్రహ్మణ్యం 40 రోజులుగా పోరాటం చేస్తూ వచ్చారు. కరోనా నెగటివ్ వచ్చినా సరే ఎక్మో, వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ వచ్చిన బాలు బుధవారం మళ్ళీ ఆరోగ్యం విషమించడంతో డాక్టర్స్ 24 గంటలు గడిస్తే కాని ఏమి చెప్పలేం అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1:04 గంటలకు బాలు తుది శ్వాస విడిచారు. సంగీత ప్రియులందరికి అన్యాయం చేస్తూ అనంతలోకాలకు వెళ్ళిపోయారు. బాలు మరణ వార్త విని సినీ ప్రముఖులు.. రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు.