దేవరకొండ ఫ్యామిలీ పార్టీలో రష్మిక..!

గీతా గోవిందం.. డియర్ కామ్రేడ్ రెండు సినిమాల్లో కలిసి నటించిన విజయ్ దేవరకొండ రష్మికలు ఆ సినిమాల టైం లో చాలా క్లోజ్ అయ్యారు. వీరిద్దరు కలిసి కనబడితే చాలు ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు రాయడం మొదలుపెట్టేస్తారు. అయినా సరే వీరు ఆ కామెంట్స్ ను అసలు పట్టించుకోరు. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ మదర్ బర్త్ డే పార్టీలో దర్శనమిచ్చింది రష్మిక. 

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ పార్టీలో రష్మిక సర్ ప్రైజ్ ఎంట్రీ మళ్ళీ వార్తలకు ఛాన్స్ ఇచ్చింది. ఎవరేం అనుకున్నా సరే మేము చేసేది చేస్తాం అనేలా వీరిద్దరి వాలకం ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే రష్మిక పుష్ప సినిమాలో ఛాన్స్ అందుకోగా.. విజయ్ దేవరకొండ పూరీ ఫైటర్ లో నటిస్తున్నాడు.