
ఐపిఎల్ సీజన్ తట్టుకుని నిలబడాటనికి బిగ్ బాస్ సీజన్ 4 గట్టి ప్రయత్నాలే చేస్తుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 లో మూడవ వారం పూర్తి కావొస్తుంది. ఈ సీజన్ లో ఇప్పటికే ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు మూడవ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా జరిగింది. మొదటి వారం కుమార్ సాయి బిగ్ బాస్ హౌజ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా సెకండ్ వీక్ మధ్యలోనే హౌజ్ లోకి వచ్చి సడెన్ సర్ ప్రైజ్ చేశాడు జబర్దస్త్ అవినాష్. ఈ ఇద్దరు చాలదు అన్నట్టుగా బిగ్ బాస్ హౌజ్ లో 3వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా రావడం జరిగింది.
తెలుగులో రెండు మూడు సినిమాల్లో నటించిన స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సీజన్ లో ఇప్పటికే హౌజ్ లో గ్లామర్ షో ఎక్కువవగా ఇప్పుడు మరో హీరోయిన్ తో ఆ డోస్ మరింత పెంచాలని చూస్తున్నారు. శుక్రవారం ఎపిసోడ్ లో హౌజ్ లోకి మాస్క్ తో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆమెకు హౌజ్ మేట్స్ అంతా గ్రాండ్ వెల్కం చెబుతున్నారు. వారానికి ఒకరు ఎలిమినేట్ అవడం ఒకరిని హౌజ్ లోకి పంపించడం జరుగుతుంది. ఈ సీజన్ లో రావాల్సిన ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేశారు. మరి ఇంతటితో ఈ వైల్డ్ ఎంట్రీస్ పూర్తయినట్టేనా లేక మళ్ళీ ఎవరినైనా తెస్తారా అన్నది చూడాలి.