
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. బిబి 3 అంటూ ఫస్ట్ లుక్ టీజర్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. ఇక సింహా, లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా 2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈమధ్య సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతున్నాయి. బిబి 3 సినిమాను కూడా అమేజాన్ ప్రైమ్ భారీ మొత్తం ఇచ్చి కొనేసిందట.
అయితే బిబి 3 డైరెక్ట్ రిలీజ్ కాకుండా కేవలం డిజిటల్ రైట్స్ మాత్రమే పొందినట్టు తెలుస్తుంది. బాలయ్య, బోయపాటి కాంబో కాబట్టి పక్కా హిట్ అనే అంచనాలతో 9 కోట్లకు ఈ సినిమా డిజిటల్ రైట్స్ కొనేశారట. బాలకృష్ణ కెరియర్ లో ఇదే హయ్యెస్ట్ అని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తుంది. తెలుగు అమ్మాయి అంజలీ ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది.