
40 రోజులుగా కరోనా మీద పోరాటం చేస్తున్న గాన గంధర్వుడు బాల సుబ్రహ్మ్యణ్యం కరోనా నెగటివ్ వచ్చాక కూడా ఇంకా ప్రాణాపాయ స్థితి నుండి బయట పడలేదు. లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల నెలన్నర నుండి చెన్నై ఎం.జి.ఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు బాల సుబ్రహ్మణ్యం. కరోనా నెగటివ్ వచ్చినా సరే ఎక్మో, వెంటిలేటర్ ద్వారానే చికిత్సను అందిస్తున్నారని తెలుస్తుంది.
బుధవారం రాత్రి జ్వరం రావడం.. ఒక్క రోజులోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని ఎం.జి.ఎం డాక్టర్స్ చెబుతున్నారు. 24 గంటలు గడిస్తేనే కాని ఏదన్నది చెప్పలేం అన్నట్టుగా ఎం.జి.ఎం హాస్పిటల్ నుండి హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. బాలు ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు కమల్ హాసన్ హాస్పిటల్ కు వచ్చి డాక్టర్స్, బాలు కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు తెలుస్తుంది. బాలు కోలుకోవాలని సంగీత ప్రియులంతా ప్రార్ధిస్తున్నారు.