టాపు లేపిన బిగ్ బాస్ టి.ఆర్.పి రేటింగ్..!

ఒక షో సక్సెస్ అయ్యింది అన్నది తెలియాలంటే వారం తర్వాత వచ్చే రేటింగ్స్ చూడాలి. ప్రేక్షకుల్లో ఆదరణ బాగున్నా అసలు జాతకాలు తేల్చేది రేటింగ్సే అన్నమాట. మూడు సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ 4ను స్టార్ట్ చేసింది. సెప్టెంబర్ 6న బిగ్ బాస్ సీజన్ 4 మొదలైంది. 3వ సీజన్ హోస్ట్ గా చేసిన నాగార్జున ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 

నాగార్జున హుశారైన వ్యాఖ్యానంతో బిగ్ బాస్ సీజన్ 4 మొదలైంది. ఇక ఆదివారం ఆ షో టి.ఆర్.పి రేటింగ్స్ రిజల్ట్స్ వచ్చాయి. బిగ్ బాస్స్ 1 నుండి 3 వరకు వచ్చిన రేటింగ్స్ అన్నిటిని బ్రేక్ చేసి నాగార్జున బిగ్ బాస్ సీజన్ 4 సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ కు 18.7 టి.ఆ.పి రేటింగ్స్ వచ్చాయి. సీజన్ 1 ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేసిన టైం లో 16.18, సీజన్ 2 నాని హోస్ట్ గా చేసిన టైం లో తొలి ఎపిసోడ్ కు 15.05 రేటింగ్ రాగా సీజన్ 3 నాగార్జున హోస్ట్ గా చేసిన తొలి రోజు ఎపిసోడ్ కు 17.9 రేటింగ్ వచ్చింది. 

మూడు సీజన్ల రేటింగ్స్ ను క్రాస్ చేస్తూ బిగ్ బాస్ సీజన్ 4 మరింత క్రేజ్ సంపాదించింది. 16 మంది కంటెస్టంట్స్ తో మొదలైన ఈ సీఎజన్ 4 వీకెండ్స్ లో అదరగొడుతుండగా వీక్ డేస్ లో కొద్దిగా నీరసంగానే సాగుతుందని చెప్పొచ్చు.