
కోలీవుడ్ లో హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న నివేదా పేతురాజ్ తెలుగులో మెంటల్ మదిలో సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాతో హిట్ అందుకున్న నివేదా పేతురాజ్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో చిన్న పాత్రతో మెప్పించింది. ప్రస్తుతం దేవా కట్ట డైరక్షన్ లో సాయి ధరం తేజ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది నివేదా పేతురాజ్.
ఈ సినిమా తర్వాత చందు మొండేటి డైరక్షన్ లో సినిమా సైన్ చేసింది అమ్మడు. ఆరెఫ్సీ లో ముహుర్త కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఫీమేల్ సెంట్రిక్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో వెల్లడిస్తారని అంటున్నారు.