
నాచురల్ స్టార్ నాని నటించిన వి ఈమధ్యనే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించగా సుధీర్ బాబు పోలీస్ పాత్రలో మెప్పించాడు. అంచనాలు భారీగా ఉండటం.. రొటీన్ కథ అవడంతో ఓటిటిలో రిలీజైన ఈ సినిమా చూసిన ఆడియెన్స్ పెదవి విరిచేశారు. నాని 25వ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందించలేదు.
ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఇక ఈ సినిమా తర్వాత నాని శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. నాని వి ఎఫెక్ట్ వల్ల టక్ జగదీష్ విషయంలో నాని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తుంది. వి షాక్ నానికి గట్టిగానే తగిలిందని తెలుస్తుంది. టక్ జగదీష్ సినిమా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తుండగా ఆ తర్వాత రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో శ్యామ్ సింగ రాయ్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు నాని.