
టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ యువి క్రియేషన్స్ ప్రస్తుతం ప్రభాస్ తో రాధే శ్యామ్ సినిమా చేస్తుంది. ఈ సినిమా తర్వాత మారుతి డైరక్షన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోగా మాస్ మహరాజ్ రవితేజ నటిస్తారని టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ ఓకే చేయగా రవితేజకు ఈ సినిమా కోసం 15 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.
రాజా ది గ్రేట్ తర్వాత హిట్టు కోసం తపిస్తున్న రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరక్షన్ లో క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో సినిమా కూడా లైన్ లో ఉంది. అంతేకాదు నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో సినిమా కూడా చేస్తాడని తెలుస్తుంది. ఈ మూడు సినిమాల తర్వాత మారుతి సినిమా ఉంటుందని టాక్. ఫ్లాపుల్లో కూడా రవితేజ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అసలు తగ్గట్లేదని తెలుస్తుంది.