
జాను ఫెయిల్యూర్ తో నిరాశపడ్డ శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆరెక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతితో మహా సముద్రం సినిమా చేస్తున్నాడు శర్వానంద్. ఈ సినిమాలో మరో హీరోగా సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు. క్రేజీ మల్టీస్టారర్ గా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తెలుగులో శైలజా కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు చేసిది.
చేసిన రెండు సినిమాలు ఫెయిల్ అవడంతో ఆమెకు తెలుగులో ఛాన్సులు రాలేదు. నాని టక్ జగదీష్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు శర్వానంద్ మహాసముద్రంలో కూడా ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది. మరి మొదటి రెండు సినిమాలు ఫెయిల్ అయినా రాబోతున్న ఈ రెండు సినిమాలతో అయినా అమ్మడికి లక్ కలిసి వస్తుందో లేదో చూడాలి.