
ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా లవ్ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ తర్వాత రీసెంట్ గానే మొదలుపెట్టారు. లాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీమామ సినిమాల హిట్ తో మంచి జోష్ లో ఉన్న నాగ చైతన్య లవ్ స్టోరీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
అసలైతే థియేటర్ రిలీజ్ చేయాలని చూస్తున్న ఈ సినిమా దర్శక నిర్మాతలకు ఓటిటి ఫ్లాట్ ఫామ్ ల నుండి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. లీడింగ్ ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఈ సినిమాకు 30 కోట్ల ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చిందట. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేసేందుకు గాను లవ్ స్టోరీకి భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం చర్చల దశల్లో ఉన్న ఈ సినిమా ఓటిటి రిలీజ్ ఉంటుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.