
వారం రోజుల క్రితం స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 4 నుండి మొదటి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ సీజన్ ఫస్ట్ ఎలిమినేట్ అయిన హౌజ్ మేట్ సూర్య కిరణ్. హౌజ్ లోకి సెకండ్ హౌజ్ మేట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన మొదటి వారమే ఎలిమినేట్ అయ్యాడు. హౌజ్ లో అందరికి సలహాలు ఇవ్వడం.. కోపాన్ని ప్రదర్శించడమే సూర్య కిరణ్ ను మొదటి వారమే ఇంటి నుండి బయటకు వచ్చేలా చేశాయని తెలుస్తుంది.
ఇక సూర్య కిరణ్ ఇలా బయటకు వచ్చాడో లేదో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఈరోజుల్లో ఫేమ్ కమెడియన్ సాయి కుమార్ ఎంట్రీ ఇచ్చారు. శని, ఆదివారాల్లో నాగార్జున హంగామా షోకి మంచి క్రేజ్ తెచ్చింది. హౌజ్ మేట్స్ తో ఆట, పాటలతో నాగార్జున మరోసారి తన ఎనర్జీ ఏంటో చూపించారు.