నాని.. రానా కలిసి చేస్తున్నారా..?

నాచురల్ స్టార్ నాని, దగ్గుబాటి రానా ఇద్దరు కలిసి ఓ క్రేజీ మల్టీస్టారర్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. రియల్ లైఫ్ లో ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్న ఈ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ రైటర్ ఈ ఇద్దరి మల్టీస్టారర్ కథ రెడీ చేయగా స్టోరీ విని ఇద్దరు హీరోలు ఇంప్రెస్ అయినట్టు తెలుస్తుంది. సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తారని ఫిల్మ్ నగర్ టాక్.

ఈ సినిమా డైరక్టర్ ఎవరు..? సినిమా ఏ జానర్ లో వస్తుందన్నది తెలియాల్సి ఉంది. రానా ఇప్పటికే బాహుబలిలో విలన్ గా చేసి మల్టీస్టారర్ కు తానెప్పుడు రెడీ అని వెల్లడించాడు. నాని కూడా దేవదాస్ తో మల్టీస్టారర్ చేశాడు. మరి నాని, రానా కలిసి చేసే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం నాని టక్ జగదీష్ సినీమ చేస్తుండగా.. నాని విరాటపర్వం సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ఈ మల్టీస్టారర్ సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.