
సింహా, లెజెండ్ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాకు టైటిల్ గా ఒకటిరెండు పరిశీలనలో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మరో యువ హీరో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా ఆ యువ హీరో ఎవరో కాదు అల్లరి నరేష్ అని అంటూ ఫిల్మ్ నగర్ టాక్.
సోలో హీరోగా చేస్తూనే గమ్య, శంభో శివ శంభో సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ సూపర్ స్టార్ మహెష్ తో మహర్షి సినిమాలో కూడా నటించారు. సినిమాలో మహేష్ స్నేహితుడిగా అల్లరోడి నటన ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా అల్లరి నరేష్ నటిస్తున్నాడని తెలుస్తుంది. బిబి 3 టైటిల్ ఎనౌన్స్ మెంట్ దసరా రోజు వస్తుందని తెలుస్తుంది.