
మెగాస్టార్ చిరంజీవి ఈమధ్యనే తన సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చారు. ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం రెండిటిలో చిరు తనకు సంబందించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. అంతేనా చిరు లోని ఎవరికి తెలియని టాలెంట్ కూడా తెలిసేలా చేశాడు. చిరు వేసిన దోశ, అమ్మ కోసం చేసిన చేపల వేపుడు ఇవి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాయి. ఇవే ఇన్ స్టాగ్రాంలో చిరుకి 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేలా చేసింది. ట్విట్టర్ లో మాత్రం చిరుని 7 లక్షలకు పెగా ఫాలోవర్స్ ఉన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నాడు చిరు. ఈ సినిమాలో రాం చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చిరు 3 సినిమాలు లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమాల గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.