ఓటిటిలో యువ హీరో సినిమా..!

యువ హీరో రాజ్ తరుణ్ లీడ్ రోల్ లో విజయ్ కుమార్ కొండ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా ఒరేయ్ బుజ్జిగా. లాక్ డౌన్ కు ముందే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినా థియేటర్లు మూతపడటం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా ఈ సినిమాను ఓటిటి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆహాలో ఈ సినిమాను అక్టోబర్ 2న రిలీజ్ ప్లాన్ చేశారు. నిరీక్షణ పూర్తయింది మీకు 100 శాతం ఎంటర్టైన్ మెంట్ ఇచ్చేందుకు వస్తున్నాం. అక్టోబర్ 2న వస్తున్నాం ఫన్ మిస్ కాకండి.   

ఈ సినిమాలో మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా మీద రాజ్ తరుణ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మరి ఆహాలో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి. ఈ సినిమామి కెకె రాధామోహన్ నిర్మించారు. సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు.