అక్కినేని హీరోతో రష్మిక..!

కన్నడ భామ రష్మిక మందన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ తన ఖాతాలో వేసుకుందని తెలుస్తుంది. ఛలో టు సరిలేరు నీకెవ్వరు చేసిన సినిమాలతో తన టాలెంట్ చూపిస్తున్న ఈ అమ్మడు ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప, మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో ఛాన్స్ అందుకోగా లేటెస్ట్ గా అక్కినేని హీరో అఖిల్ సినిమాలో కూడా అమ్మడు సెలెక్ట్ అయినట్టు టాక్. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో అఖిల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే సురేందర్ రెడ్డితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.      

స్పై థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో అఖిల్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. బ్యాచ్ లర్ సినిమాలో పూజా హెగ్దేతో రొమాన్స్ చేస్తున్న అఖిల్ సురేందర్ రెడ్డి సినిమాలో రష్మికతో జోడీ కడుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లక్కీ అండ్ సూపర్ క్రేజ్ హీరోయిన్స్ అయిన పూజా, రష్మికలను తన సినిమాలో పెట్టుకుని సినిమాలు హిట్ట్ కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. బ్యాచ్ లర్ సినిమా 2021 సంక్రాతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. అఖిల్ కు ఆ సినిమా అయినా కమర్షియల్ సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.