చిరు ఏంటీ కొత్త లుక్కు..!

మెగాస్టార్ చిరంజీవి తన కొత్త లుక్ తో షాక్ ఇచ్చారు. గుండు బాస్ లుక్ లో చిరు లుక్ సర్ ప్రైజ్ ఇచ్చింది. అయితే చిరు ఈ ఇది ఓ సినిమా కోసమే ట్రై చేశాడంటూ వార్తలు వస్తున్నాయి. సన్యాసిగా ఎలా ఉంటాను అంటూ కామెంట్ పెట్టడంతో ఇదేదో సినిమా కోసమే చిరు ఈ లుక్ ట్రై చేసినట్టు ఉన్నారని తెలుస్తుంది. ఆచార్య తర్వాత చిరు చేస్తున్న మూడు సినిమాల్లో కె.ఎస్ బాబి డైరక్షన్ లో సినిమాలో ఒక స్పెషల్ రోల్ ఉందని తెలుస్తుంది. అందుకోసమే చిరు ఇలా కొత్తగా ప్రయత్నించి ఉంటారని అంటున్నారు.       

ఇక మరోపక్క చిరు మెహెర్ రమేష్ కాంబినేషన్ లో తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం రీమేక్ కూడా లైన్ లో ఉంది. ఆ సినిమాలో గెటప్ కోసం చిరు ఇలా గుండుతో కనిపించాడని అంటున్నారు. ఏది ఏమైనా ఈ వయసులో యువ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా సీనియర్ హీరోలు కష్టపడటం చూసి షాక్ అవ్వాల్సిందే. ఆచార్య పూర్తి కాగానే ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు చిరు.