కమల్ హాసన్ తో మురుగదాస్..!

కోలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ అవబోతుందని తెలుస్తుంది. తమిళ సెన్సేషనల్ డైరక్టర్ మురుగదాస్ లోక నాయకుడు కమల్ హాసన్ తో సినిమా చేస్తున్నాడని టాక్. ఇప్పటికే వీరి మధ్య కథా చర్చలు ముగిశాయట. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని కోలీవుడ్ టాక్. మురుగదాస్ తన కెరియర్ లో ఎంతోమంది స్టార్స్ తో పనిచేశాడు కాని కమల్ తో పనిచేయడం ఇదే మొదటిసారి. కమల్ హాసన్ కోసం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో కథ రెడీ చేశాడట మురుగదాస్. కమల్ కు కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.                      

సూపర్ స్టార్ రజినికాంత్ తో దర్బార్ సినిమా తర్వాత అసలైతే ఇళదళపతి విజయ్ తో మురుగదాస్ తుపాకి 2 సినిమా తీస్తాడని వార్తలు వచ్చాయి. మరి ఏమైందో ఏమో కాని ఈ సినిమాను పక్కన పెట్టి కమల్ తో సినిమాకు రెడీ అవుతున్నాడట మురుగదాస్. కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ డైరక్షన్ లో ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మురుగదాస్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.