అల్లు అర్జున్ పుష్పలో మరో హీరో..?

అల వైకుంఠపురములో సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా సుకుమార్ డైరక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు. పుష్ప అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఏర్పరచిన ఈ మూవీ పాన్ ఇండియాలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడని అంటున్నారు. నారా ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన నారా రోహిత్ తన మార్క్ సినిమాలతో అలరించాడు. 

కెరియర్ లో ఈమధ్య వెనక పడినట్టు అనిపించిన నారా రోహిత్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఛాన్స్ అందుకున్నాడని అంటున్నారు. అదే నిజమైతే నారా రోహిత్ కు లక్ తగిలినట్టే. సినిమాలో రోహిత్ ఉన్నాడు అంటే నందమూరి ఫ్యాన్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచుకునే ఛాన్స్ ఉంది. మొత్తానికి పుష్ప సినిమా కోసం సుకుమార్ భారీ ప్లానింగ్ వేసినట్టు ఉన్నాడని తెలుస్తుంది.