
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమాదాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడ్డది. దీనితో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగింది. సుశాంత్ ప్రియురాలైన రియాను మూడు రోజుల నుండి విచారిస్తున్న అధికారులు ఫైనల్ గా ఈరోజు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తాను గంజాయి మాత్రమే కాదు ఇతర కెమికల్స్ కూడా వాడినట్టు రియా ఒప్పుకున్నారని సమాచారం. సుశాంత్ కోసమే తాను డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆమె విచారణలో అంగీకరించారని తెలుస్తుంది.
సాయంత్రం 5 గంటలకు రియాకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలుస్తుంది. సుశాంత్ సినిమా సెట్ లో డ్రగ్స్ వాడినట్టు రియా సమాచారం ఇవ్వగా బాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖులకు సమన్లు పంపించేందుకు ఎన్సీబీ రెడీ అవుతుందని తెలుస్తుంది. మొత్తం 25 మంది బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు ఎన్.సి.బి ముందు ఉంచారట రియా. సుశాంత్ కేసుని సిబిఐ దర్యాప్తు చేస్తుండగా డ్రగ్స్ కోణం బయటపడటంతో ఎన్.సి.బీ రంగంలోకి దిగింది.