
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణా రాష్ట్ర పరిధిలోని ఖాజీపల్లి అర్బన్ ఫారెస్ట్ ను దత్తత తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్న 1650 ఎకరాల విస్తీర్ణంతో ఈ అటవీ భూమి ఉంది. ఈ ఫారెస్ట్ ను అభివృద్ధి చేసేందుకు గాను ప్రభాస్ 2 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. అవసరాన్ని బట్టి మరింత మొత్తం ఇవ్వడానికి ప్రభాస్ ఓకే చెప్పారట. తన తండ్రి స్మారకంగా అడవిని దత్తత తీసుకున్నారు ప్రభాస్.
ఈ ఫారెస్ట్ అభివృద్ధి పనులకు సంబంధించి సోమవారం శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. టి.ఆర్.ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ సలహా మేరకే ప్రభాస్ ఈ ఫారెస్ట్ ను అడాప్ట్ చేసుకున్నారని తెలుస్తుంది. ఇక అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభాస్ రూటే సెపరేట్.. మాములుగా స్టార్స్ ఊరిని దత్తత తీసుకోవడం విన్నాం.. పిల్లల బాధ్యతలను తీసుకున్న వారు తెలుసు.. కానీ అటవీ భూములను అడాప్ట్ చేసుకుని తన స్పెషాలిటీ చూపించారు ప్రభాస్.