మొదటిరోజే నామినేషన్స్.. బిగ్ బాస్ నీకిదేమన్నా బాగుందా..?

బిగ్ బాస్ సీజన్ 4 హౌజ్ మేట్స్ మధ్య అప్పుడే కిరికిరి పెట్టేశాడు బిగ్ బాస్. రోజున్నర పరిచయంలో ఒకరిని సేవ్ చేసి మరొకరిని నామినేట్ చేయాలంటే కొద్దిగా కష్టమే. సరదాగా ఆడటానికి కాదు కదా బిగ్ బాస్ హౌజ్ కు వెళ్ళింది. అందుకే ఆయన ఇచ్చిన టాస్కులు పూర్తి చేయక తప్పదు బిగ్ బాస్ హౌజ్ లో డే 1 ఊహించిన దాని కన్నా ఎక్కువ స్టఫ్ దొరికేసింది. కరాటే కళ్యాణి వర్సెస్ జోరుదార్ సుజాతకి చిన్న మాటా మాటా.. అబ్బో సీన్ సితార అయిపొయింది.  

ఈలోగా నామినేషన్స్.. అక్కడ సీన్ ఇక్కడ రిపీట్ చేశారు. ఇంతలోనే నా నోరు పెద్దది నేను చిన్నగా చెప్పినా పెద్దగా వినిపిస్తుంది అంటూ కరాటే కళ్యాణి ఏడ్చేయడం. మొదటి రోజు నామినేషన్స్ చాలా సరదాగా సాగినా ఈ ఇద్దరి మధ్య జరిగిన ఎపిసోడ్ హైలెట్ అవుతూ వచ్చింది. సీజన్ 3లో హేమ కూడా మొదటి రెండు రోజుల్లోనే ఇలానే రచ్చ రంబోలా చేసి మొదటి వారంలోనే ఇంటికి వెళ్ళింది. అయితే కరాటే కళ్యాణి మాత్రం ఈసారి నామినేషన్స్ లో లేదు. బిగ్ బాస్ నాల్గవ సీజన్ ల్లో మొదటివారం నామినేషన్ లో ఉన్నది ఎవరంటే గంగవ్వ, దివి,సుజాత, అభిజిత్, సూర్య ప్రకాష్, మెహబూబ్,అఖిల్. వీరిలో ఒకరి ఈ వీకెండ్ బిగ్ బాస్ హౌజ్ కు బై బై చెప్పబోతున్నారు.