కరోనాని జయించిన బాల సుబ్రహ్మణ్యం

ఆగష్టు 5 నుండి కరోనాతో పోరాడుతున్న గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం దాన్ని జయించారు. లేటెస్ట్ రిపోర్ట్స్ లో తన తండ్రికి కరోనా నెగటివ్ వచ్చిన విషయాన్ని వెల్లడించారు బాలు తనయుడు చరణ్. ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ కూడా క్రమంగా తగ్గుతూ వస్తుందని.. అయితే నాన్న గారు ఇప్పటికి వెంటిలేటర్ మీద ఉన్నారని చెప్పారు చరణ్. పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పడుతుందని అన్నారు.      

అమ్మా నాన్నల పెళ్ళిరోజు కూడా హాస్పిటల్ లోనే జరుపుకున్నారు. నాన్న గారు ఐపాడ్ లో క్రికెట్, టెన్నీస్ చూస్తున్నారని అన్నారు ఎస్పీ చరణ్. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అంటూ చరణ్ ఒక వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. చరణ్ చెప్పిన మాటలను బట్టి చూస్తే బాలు అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలుస్తుంది. త్వరలోనే ఆయన మళ్ళీ మామూలు మనిషి కావాలని కోట్ల మంది అభిమానులు కోరుకుంటున్నారు.