నేను ఐటం గాళ్ కాదు..!

ఆరెక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ ఆ సినిమాతో యూత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఫస్ట్ సినిమా హిట్ అవడంతో వరుస ఛాన్సులు వస్తున్నాయి. ఈమధ్య వెంకీమామ, డిస్కో రాజా సినిమాలతో అలరించిన పాయల్ రాజ్ పుత్ రెండు క్రేజీ సినిమాల్లో ఐటం సాంగ్స్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి ఇండియన్ 2 కాగా.. మరోటి పుష్ప.

శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీ ఇండియన్ సినిమాకు సీక్వల్ గా ఈ మూవీ వస్తుంది. సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా నివేదా థామస్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ మూవీలో పాయల్ స్పెషల్ ఐటం సాంగ్ ఉంటుందని టాక్. ఇక ఇదేకాకుండా సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప సినిమాలో కూడా పాయల్ ఐటం సాంగ్ ఉంటుందని అన్నారు. కాని ఈ రెండు సినిమాల్లో తాను ఎలాంటి సాంగ్స్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్.

సోలో హీరోయిన్ గా ఛాన్సులు వస్తున్న ఇలాంటి టైం లో తనకు ఐటం సాంగ్స్ చేసే ఉద్దేశం లేదని చెబుతుంది అమ్మడు. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.