వంశీ పైడిపల్లితో మహేష్..?

సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత 27వ సినిమా వంశీ పైడిపల్లితోనే అన్న వార్తలు వచ్చాయి. వంశీ చెప్పిన లైన్ నచ్చినా ఫుల్ స్క్రిప్ట్ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టి పరశురాం సినిమాకు లైన్ క్లియర్ చేశాడు మహేష్. సర్కారు వారి పాట టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచాడు పరశురాం. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్నారు.

వంశీ పైడిపల్లిని కాదని పరశురాం కు ఓకే చెప్పినందుకు వంశీ పైడిపల్లి మహేష్ కు దూరమయ్యాడని మొన్నీమధ్య వార్తలు వచ్చాయి. అయితే అదంతా మీడియా కల్పితమని తేలిపోయింది. మహేష్ నిర్మాతగా వెబ్ సీఎరీస్ లను నిర్మించాలని అనుకుంటున్నాడు. కొత్త దర్శకులు చెబుతున్న కథలు విని ఏది ఫైనల్ చేయాలని డిస్కస్ చేసేంత టైం మహేష్ కు ఉండటం లేదట. అందుకే నమ్రతతో పాటుగా తన ప్రొడక్షన్ కు సంబందించిన వెబ్ సీరీస్ స్టోరీ డిస్కషన్స్ లో వంశీ పైడిపల్లిని జాయిన్ చేసుకున్నాడట మహేష్. రైటర్స్, డైరక్టర్స్ చెప్పే కథ విని ఫైనల్ చేయడం.. మార్పులు సూచించడం లాంటివి వంశీ పైడిపల్లి హెల్ప్ తీసుకుంటున్నాడట మహేష్. మొత్తానికి ఇద్దరి మధ్య గొడవ అయ్యిందని మీడియా రాసిన వార్తలన్ని రూమర్స్ అని తెలిసిపోయింది.